logo

పిల్లల్లో సైన్స్‌పై ఆసక్తి పెంపొందించాలి

పిల్లల్లో సైన్స్‌ పై ఆసక్తి పెంపొందించాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్‌.వినయ్‌కుమార్‌ అన్నారు.

Published : 29 Jan 2023 02:35 IST

ఉపాధ్యాయురాలు నూరున్నీసాకు జ్ఞాపిక అందజేస్తున్న వినయ్‌కుమార్‌

బాగ్‌లింగంపల్లి: పిల్లల్లో సైన్స్‌ పై ఆసక్తి పెంపొందించాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్‌.వినయ్‌కుమార్‌ అన్నారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న తెలంగాణ బాలోత్సవం, పిల్లల జాతర శనివారం ముగిసింది. 60 పాఠశాలలకు చెందిన 4వేల మంది బాలబాలికలు పాల్గొని పలు అంశాల్లో ప్రతిభ చాటారు. వక్తలతో కలిసి ఆయన విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులకు పురస్కారాలు అందజేసి మాట్లాడారు. బాలలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ బాలోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. విజ్ఞాన దర్శిని కన్వీనర్‌ రమేష్‌, రచయిత భూపతి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్‌రెడ్డి, చొక్కాపు వెంకటరమణ, బాలోత్సవ్‌ కార్యదర్శి సోమయ్య, బుచ్చిరెడ్డి, నూరున్నీసా, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని