logo

ఆహా అందాల నేహాశెట్టి

డీజే టిల్లు చిత్రంలో నటించిన నేహాశెట్టి కేపీహెచ్‌బీలో సందడి చేశారు.

Published : 29 Jan 2023 02:35 IST

కేపీహెచ్‌బీలో డీజే టిల్లు తార సందడి

జ్యోతి వెలిగిస్తున్న నటి నేహాశెట్టి, నిర్వాహకులు

కేపీహెచ్‌బీకాలనీ: డీజే టిల్లు చిత్రంలో నటించిన నేహాశెట్టి కేపీహెచ్‌బీలో సందడి చేశారు. శనివారం జేఎన్‌టీయూ చౌరస్తాలోని సర్వీస్‌ రోడ్డు ప్రవేశంలో గోయాజ్‌ పేరిట ఏర్పాటు చేసిన జ్యుయలరీ దుకాణాన్ని నటి ప్రారంభించారు. దుకాణంలోని నగలను ధరించారు. పలు ఆభరణాలను ప్రదర్శించారు. ఇక్కడి అధునాతన డిజైన్లు తనకు నచ్చాయన్నారు. త్వరలో విడుదల కానున్న బెదురులంక చిత్రంలో నటించినట్లు చెప్పారు. దుకాణ డైరెక్టర్లు వేములూరి ప్రియాంక, రవితేజ, అఖిల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని