logo

సందడిగా ముగిసిన సాంస్కృతికోత్సవం

జంటనగరాల్లోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన మెగా మేనేజ్‌మెంట్‌, కల్చరల్‌ మీట్‌ ‘స్ల్పాష్‌-2023’లో అత్యధిక పోటీల్లో గెలుపొందిన గోల్కొండ ఇబ్రహీంబాగ్‌కు చెందిన పెండేకంటి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ‘క్రౌన్‌ ఆఫ్‌ కాలేజెస్‌ ట్రోఫీ’ని కైవసం చేసుకుంది.

Published : 29 Jan 2023 02:35 IST

ట్రోఫీ, మెమెంటోలతో విజేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: జంటనగరాల్లోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన మెగా మేనేజ్‌మెంట్‌, కల్చరల్‌ మీట్‌ ‘స్ల్పాష్‌-2023’లో అత్యధిక పోటీల్లో గెలుపొందిన గోల్కొండ ఇబ్రహీంబాగ్‌కు చెందిన పెండేకంటి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ‘క్రౌన్‌ ఆఫ్‌ కాలేజెస్‌ ట్రోఫీ’ని కైవసం చేసుకుంది. శనివారం కాచిగూడలోని బద్రుకా కళాశాల పీజీ సెంటర్‌లో ఓయూ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి ప్రొ.శ్రీరాములు, సిటీ బ్యాంక్‌ ఉపాధ్యక్షుడు మనీష్‌షాలు విజేత జట్టుకు ట్రోఫీని, ఆయా పోటీల విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. బద్రుకా కళాశాల డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ అభిరామకృష్ణ, డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ రాజేశ్వరి, అసోసియేట్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని