logo

బాలికా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి

బాలికా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.నంద అన్నారు.

Published : 29 Jan 2023 02:35 IST

జస్టిస్‌ నందను సన్మానిస్తున్న సురేంద్ర లూనియా

గోల్నాక: బాలికా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.నంద అన్నారు. శనివారం చాదర్‌ఘాట్‌ ఆర్‌జీ కేడియా కళాశాల ఆడిటోరియంలో స్వశక్తి స్మార్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. కుటుంబ నిర్ణయాల్లో కౌమార బాలికలను భాగస్వాములను చేయాలని సూచించారు. వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి, సంస్థ వ్యవస్థాపకురాలు మాధవి మాట్లాడుతూ 2025 నాటికి వెయ్యి సదస్సులు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. మార్వాడీ శిక్షాసమితి కార్యదర్శి సురేంద్ర లూనియా, ఎస్‌బీ కాబ్రా, డాక్టర్‌ డీవీజీ కృష్ణ, డాక్టర్‌ పి.అమితరాణి, వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని