logo

కొత్త మహిళా సంఘాలకు రూ.2.01 కోట్లు

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు.

Published : 30 Jan 2023 00:54 IST

మంజూరుతో ఆర్థిక వృద్ధికి తోడ్పాటు

 

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు ప్రగతి పథంలో పయనించాలనేది ప్రభుత్వ ఆశయం. సంఘాలు ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు అంతగా లేక ఉన్నతి వైపు పరుగులు వేయలేక పోతున్నారు. దీనిని గుర్తించి కొత్త సంఘాలు నిరంతరంగా కార్యకలాపాలను నిర్వహించాలన్న ఉద్దేశంతో తాజాగా వాటికి రూ.2.01 రివాల్వింగ్‌ ఫండ్‌ను మంజూరు చేశారు.

సెర్ప్‌ ఆదేశాల మేరకు...

జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆదేశాల మేరకు 2021- 22, 23 సంవత్సరాల్లో కొత్త మహిళా సంఘాలకు 2.01 కోట్లను విడుదల చేశారు. జిల్లాలోని 1337 మహిళా సంఘాలకు ఒక్కొక్క సంఘానికి రూ.15 వేల చొప్పున రివాల్వింగ్‌ ఫండ్‌ పేరుతో వీటిని కేటాయించారు. వీటిని సంఘాల బ్యాంక్‌ ఖాతాలో నేరుగా సర్దుబాటు చేశారు. ఇందుకోసం అధికారులు ఓటరు జాబితాను అనుసరించారు. ఆ ప్రకారం సంఘంలో ఉన్న వారు ఎంత మంది, లేని వారు ఎంత మంది అనేది పరిశీలించారు. సంఘంలో సభ్యులుగా లేని వారిని గుర్తించి వారిని కలిసి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. డబ్బులను తక్కువ వడ్డీతో సభ్యులకు ఇస్తూ అభివృద్ధి పర్చాలి. వీటిని చిరు వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించుకోవచ్చు.


తగిన విధంగా ప్రోత్సాహం

- కె.నర్సింహులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అదనపు అధికారి

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు నిధులను విడుదల చేసి వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తోంది. నిధులను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికంగా వృద్ధి చెందాలి. సంఘ కార్యకలాపాలు నిరంతరం కొనసాగే విధంగా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని