logo

నిరుపయోగం.. వినియోగిస్తే నయం

తాండూరు విద్యుత్తు ఉప కేంద్రం ఆవరణలో నిలువరించిన వాహనాన్ని అధికారులు వినియోగంలోకి తెస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

Published : 30 Jan 2023 00:54 IST

తాండూరు విద్యుత్తు ఉప కేంద్రం ఆవరణలో నిలువరించిన వాహనాన్ని అధికారులు వినియోగంలోకి తెస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. తాండూరు నియోజకవర్గంలో రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్తు సరఫరా చేసే నియంత్రికలు కాలిపోతున్నాయి. వీటి మరమ్మతు కోసం రూ.వేలల్లో చెల్లించి అద్దె ట్రాక్టర్ల ద్వారా తాండూరు కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి వేరొక నియంత్రికను రైతులు అద్దె ట్రాక్టర్లలోనే గమ్యస్థానానికి చేరుస్తున్నారు. ఇలా ఒకసారి ఒక్కో ట్రాక్టర్‌ రాకపోకలకు రూ.5000 వరకు చెల్లించు కోవాల్సి వస్తోంది. అదే విద్యుత్తు ఉప కేంద్రం ఆవరణలో నిరుపయోగంగా ఉన్న వాహనాన్ని నియంత్రికల తరలింపునకు వినియోగిస్తే రైతులకు రవాణా ఖర్చులు తప్పుతాయి. అధికారులు తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని వెంటనే అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, తాండూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని