logo

ఇంధనం లేదు

గ్రేటర్‌లో పారిశుద్ధ్య వాహనాలకు డీజిల్‌ సరఫరా ఆగిపోయింది. ఇంధనాన్ని నింపే బంకు యజమానికి చాలా రోజులుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. బంకు యజమాని డీజిల్‌ పంపిణీని ఆపేశారు.

Published : 30 Jan 2023 03:34 IST

ఆగిన పారిశుద్ధ్య వాహనాలు..

ఖైరతాబాద్‌లో పార్కింగ్‌ యార్డుకు పరిమితమైన చెత్త తరలింపు వాహనాలు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో పారిశుద్ధ్య వాహనాలకు డీజిల్‌ సరఫరా ఆగిపోయింది. ఇంధనాన్ని నింపే బంకు యజమానికి చాలా రోజులుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. బంకు యజమాని డీజిల్‌ పంపిణీని ఆపేశారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ అధికారుల నిర్వాకంతో ఈ దుస్థితి నెలకొంది. పారిశుద్ధ్యంపై తీవ్ర ప్రభావం పడింది. బస్తీలు, కాలనీల్లో చెత్తకుప్పలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. మూడురోజులుగా ఖైరతాబాద్‌ యార్డు పరిధిలోని  టిప్పర్లు, చెత్తకుప్పలను తొలగించే వాహనాలు, భారీ ట్రక్కులు పార్కింగ్‌ యార్డుకే పరిమితమయ్యాయి. పార్కింగ్‌ యార్డులోని ప్రైవేటు డీజిల్‌ బంకుకు 70రోజులకు సంబంధించి సుమారు రూ.3 కోట్ల బకాయి ఉందని, నిధులు చెల్లించకపోవడంతో యజమాని బంకును మూసేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. అధికారుల చర్యతో 300 మంది డ్రైవర్లు, 800మంది కార్మికులు ఖాళీగా ఉంటున్నారని వాపోయారు. ఇదే విషయమై అధికారులను వివరణ కోరగా.. బిల్లుల చెల్లింపులో జాప్యంతో వాహనాలు నిలిచిపోవడం వాస్తవమని, రోడ్లపై చెత్తను ప్రైవేటుగా పారిశుద్ధ్య పనులు నిర్వర్తించే రాంకీ సంస్థ వాహనాలతో తొలగిస్తున్నామన్నారు. కార్మికులు మాత్రం.. సర్కారు వాహనాలను ఉద్దేశపూర్వకంగా ఆపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మున్ముందు అన్ని జోనల్‌ కార్యాలయాల్లో ఇలాగే జరుగుతుందని, 2,500ల మంది కార్మికుల ఉపాధిని జీహెచ్‌ఎంసీ ప్రశ్నార్థకం చేస్తోందని వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని