logo

గోల్కొండ కోటలో జీ-20 ప్రతినిధులు

జీ-20 ప్రతినిధుల బృందం ఆదివారం సాయంత్రం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించింది. 5 బస్సుల్లో సుమారు 130 మంది ప్రతినిధులు సాయంత్రం 5.40కు కోటకు చేరుకున్నారు.

Updated : 30 Jan 2023 03:53 IST

ప్రతినిధులకు కోట ప్రాశస్త్యం వివరిస్తున్న గైడ్‌

గోల్కొండ, న్యూస్‌టుడే: జీ-20 ప్రతినిధుల బృందం ఆదివారం సాయంత్రం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించింది. 5 బస్సుల్లో సుమారు 130 మంది ప్రతినిధులు సాయంత్రం 5.40కు కోటకు చేరుకున్నారు. మొదటగా కోటలోని క్లాపింగ్‌పోర్టికో, అక్కన్నమాదన్న కార్యాలయం, తారామతి మసీదు నుంచి రాణీమహల్‌ మీదుగా లైట్‌అండ్‌సౌండ్‌షో జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. క్లాపింగ్‌ పోర్టికో వద్ద చప్పట్లు చరిస్తే కోటపైన ఉన్న దర్బార్‌హాల్‌లో వినిపిస్తుందని ప్రతినిధులకు గైడ్‌ శ్రీనివాస్‌ వివరించారు. కుతుబ్‌షాహీల సమయంలో చప్పట్ల ద్వారా దర్బార్‌లో ఉండే వారికి సమాచారం చేరవేసేవారని తెలిపారు. కోటలోని నిర్మాణాలను వీక్షించిన అనంతరం బృందం లైట్‌అండ్‌సౌండ్‌షో ప్రాంగణానికి చేరుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యానంలో నడిచిన లైట్‌అండ్‌సౌండ్‌షో ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. జీ-20 ప్రతినిధుల బృందం రాకను పురస్కరించుకుని ఆదివారం కోటలోకి పర్యాటకులను అనుమతించలేదు. ఈ సందర్భంగా పశ్చిమ మండలం డీసీపీ జోయెల్‌డేవిస్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని