logo

ట్యాంక్‌బండ్‌పై రేసింగ్‌కు కౌంట్‌డౌన్‌

దేశంలోనే మొట్టమొదటి ఫార్ములా-ఈ రేసింగ్‌కు హుస్సేన్‌సాగర్‌ తీరం ముస్తాబవుతోంది.

Published : 30 Jan 2023 03:34 IST

ఐ మ్యాక్స్‌ పక్కన నిర్మాణంలో ఉన్న రేసర్ల పెవిలియన్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే మొట్టమొదటి ఫార్ములా-ఈ రేసింగ్‌కు హుస్సేన్‌సాగర్‌ తీరం ముస్తాబవుతోంది. ఇదివరకే ప్రత్యేకంగా ట్రాక్‌ నిర్మించగా.. రేసర్ల కోసం పెవిలియన్‌, సందర్శకుల గ్యాలరీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వేడుకను పూర్తిగా నెట్‌ జీరో విధానంలో ప్రపంచంలోనే మొదటిసారి నిర్వహించబోతున్నారు. మోటారు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్‌ కార్ల రేసింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఫిబ్రవరి 11న జరిగే గ్రీన్‌కో హైదరాబాద్‌ ఈ-ప్రిక్స్‌కు పలువురు టాలీవుడ్‌ సినీ, క్రీడా ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు.  హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, అక్కినేని చైతన్య, నానితోపాటు క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు తమ మద్దతు, ఉత్సాహాన్ని ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో తమ సందేశాలను పోస్ట్‌ చేశారు. గ్రీన్‌కో గ్రూప్‌, ఏస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు అనిల్‌ చలమలశెట్టి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన వనరులతోనే రేసింగ్‌ వేడుకను నిర్వహిస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని