logo

ఇంజినీరింగ్‌ సీట్ల పేరుతో మోసం

ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌, వైద్యసీట్లు ఇప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేసిన దంపతులను అరెస్టు చేయాలంటూ బాధితులు డిమాండ్‌ చేశారు.

Published : 30 Jan 2023 03:34 IST

కాచిగూడలో కార్యాలయం వద్ద బాధితుల నిరసన

సుల్తాన్‌బజార్‌, అంబర్‌పేట్‌, న్యూస్‌టుడే: ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌, వైద్యసీట్లు ఇప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేసిన దంపతులను అరెస్టు చేయాలంటూ బాధితులు డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు చేసి రెండేళ్లవుతున్నా పోలీసులు పట్టుకోవట్లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. కాచిగూడలో శ్రీధర్‌రెడ్డి, సంధ్యారెడ్డి దంపతులు గ్రోవెల్‌ ఎడ్యుకేషన్‌, కేరీర్‌ సర్వీసెస్‌ పేరుతో కన్సల్టెన్సీ సంస్థను నిర్వహించేవారు. ఏపీ, తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేశారు. మెడికల్‌ సీటుకు రూ.50 లక్షలు, ఇంజినీరింగ్‌ సీటుకు రూ.10-25 లక్షలు చొప్పున రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆరోపణలున్నాయి. నిందితులపై నగర సీసీఎస్‌, అంబర్‌పేట్‌, సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. వీరిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ఐదు నెలలుగా బాధిత విద్యార్థులు కన్సల్టెన్సీ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవటంతో ఆదివారం కాచిగూడ, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాల్లో నిందితుల ఫొటోలతో ఆందోళన నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని