logo

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌రోడ్డు మధ్య నుంచి మెట్రో

విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ ఖరారు, స్టేషన్‌ ప్రదేశాల తుది ఎంపిక కోసం సీనియర్‌ ఇంజినీర్లతో కలిసి విమానాశ్రయ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.

Updated : 30 Jan 2023 03:55 IST

భవిష్యత్తులో అదనంగా స్టేషన్లు నిర్మించేలా డిజైన్‌

ఓఆర్‌ఆర్‌ నార్సింగి వద్ద అలైన్‌మెంట్‌ను పరిశీలిస్తున్న మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ ఖరారు, స్టేషన్‌ ప్రదేశాల తుది ఎంపిక కోసం సీనియర్‌ ఇంజినీర్లతో కలిసి విమానాశ్రయ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. నార్సింగి అండర్‌పాస్‌ నుంచి రాజేంద్రనగర్‌ గుట్ట వరకు దాదాపు 10 కి.మీ. నడిచి అలైన్‌మెంట్‌లోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ మోహన్‌, జీఎంలు ఎం.విష్ణువర్దన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌ నాయక్‌, ఎస్‌ఈ సాయపురెడ్డి, డీఎస్పీ కె.శ్రీనాథ్‌రెడ్డి, సీనియర్‌ అధికారులకు మెట్రో ఎండీ పలు మార్గదర్శకాలు, ఆదేశాలు ఇచ్చారు.

* విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ ప్రైవేటు ఆస్తుల సేకరణను నివారించే విధంగా.. సాధ్యమైనంతవరకు సాంకేతికతంగా తగ్గించే విధంగా ఖరారు చేయాలి.

* మెట్రో స్తంభాలు నానక్‌రాంగూడ కూడలి నుంచి అప్పా కూడలి వరకు సర్వీస్‌రోడ్డు వెంట సెంట్రల్‌ మీడియంలో ఉండాలి. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.

* కారిడార్‌ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన వాణిజ్య, నివాస భవనాల అవసరాలను తీర్చడానికి, భవిష్యత్తులో అదనపు స్టేషన్ల నిర్మాణం కోసం గుర్తించిన ప్రదేశాల్లో మెట్రో వయాడక్ట్‌ ప్లాన్‌ చేయాలి.

* మెట్రో స్టేషన్‌ పనులు వేగంగా పూర్తిచేసేందుకు తాత్కాలిక కాస్టింగ్‌ యార్డుల ఏర్పాటుకు కారిడార్‌ సమీపంలోని ప్రభుత్వ భూములు గుర్తించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని