logo

త్వరలో వందశాతం మురుగు శుద్ధి సాకారం

దేశంలోనే 100 శాతం మురుగు శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్‌ ఖ్యాతికెక్కనుంది.  

Published : 30 Jan 2023 03:34 IST

పూర్తి కావొస్తున్న ఖాజాగూడ ఎస్టీపీ

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే 100 శాతం మురుగు శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్‌ ఖ్యాతికెక్కనుంది.  ఇప్పటికే గ్రేటర్‌ వ్యాప్తంగా 31 ప్రాంతాల్లో జలమండలి కొత్త మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీలు) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  వచ్చే నెల నుంచి ఒక్కో ఎస్టీపీ అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. జులై నాటికి దాదాపు 1100 ఎంఎల్‌డీల మురుగు శుద్ధి సామర్థ్యం అదనంగా పెరగనుంది. ఫిబ్రవరి నాటికి దుర్గం చెరువు, మార్చి ఏప్రిల్‌లో మీరాలం, అత్తాపూర్‌ జూన్‌, జులైలో అంబర్‌పేట, నాగోలు ఎస్టీపీలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని