logo

ఫిజియోథెరపిస్టుల సేవలు ఎంతో ముఖ్యం

ఆదాయ మార్గాల వైపు మొగ్గు చూపకుండా రోగులను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఫిజియోథెరపి వైద్యులు సేవలందించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్టీ) సభ్యురాలు, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ సూచించారు.

Published : 30 Jan 2023 03:34 IST

ఎన్‌సీఎల్టీ సభ్యురాలు జస్టిస్‌ టి.రజనీ

వైద్య సేవారత్న అవార్డు అందజేస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ

రెజిమెంటల్‌బజార్‌: ఆదాయ మార్గాల వైపు మొగ్గు చూపకుండా రోగులను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఫిజియోథెరపి వైద్యులు సేవలందించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్టీ) సభ్యురాలు, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ సూచించారు. ఆదివారం  సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆసుపత్రి ఆడిటోరియంలో ఎల్డర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ (ఈసీఐఎఫ్‌), తెలంగాణ ఫిజియోథెరపిస్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (టీపీడబ్ల్యూఏ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ఫిజియోథెరపీ వైద్యులకు వైద్య సేవా రత్న అవార్డులు ప్రదానం చేశారు.  ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఫిజియోథెరపిస్టుల సేవలు సమాజానికి ఎంతో ముఖ్యమని చెప్పారు.  104 మంది ఫిజియోథెరపి వైద్యులకు సేవా రత్న అవార్డులను అందజేశారు.  ఈసీఐఎఫ్‌ వ్యవస్థాపకులు మందాడి కృష్ణారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌ ఆవులప్ప, ఛైర్‌పర్సన్‌ సూర్యనారాయణ, టీపీడబ్ల్యూఏ అధ్యక్షులు డాక్టర్‌ కొల్లా చిట్టిబాబు, డాక్టర్‌ ఎం.కిషోర్‌కుమార్‌, డాక్టర్‌ ఇందు మాధవిలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని