ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఊపిరితిత్తుల వైద్య విభాగాల పటిష్ఠం
అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఊపిరితిత్తుల వైద్య విభాగాలను పటిష్ఠం చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
బ్రాంకస్ 2023 సదస్సులో వైద్యారోగ్య శాఖ మంత్రి
కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనను తిలకిస్తున్న హరీశ్‌రావు
రాయదుర్గం: అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఊపిరితిత్తుల వైద్య విభాగాలను పటిష్ఠం చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మాదాపూర్ హెచ్‌ఐసీసీలో యశోదా ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల బ్రాంకస్ 2023 సదస్సు, లైవ్ వర్క్ షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నగరం నలువైపులా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒక ఫ్లోర్ ప్రత్యేకంగా ఊపిరితిత్తుల విభాగానికి కేటాయించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. వైద్య కళాశాలల్లో పల్మనాలజీ విభాగాలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. యశోదా ఆసుపత్రి గ్రూప్ ఎండీ డా.జీఎస్ రావు మాట్లాడుతూ.. ఊపిరితిత్తుల వ్యాధులు, కరోనా, ఉబ్బసం సమస్యల నుంచి ఉపశమనం కలిగించే అత్యాధునిక వైద్య విధానాలను దక్షిణాదిలో తొలిసారిగా తమ వైద్యులే ప్రవేశపెట్టారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!