logo

రెండేళ్లు పూర్తిచేసుకున్న ‘ప్రాజెక్టు ప్రిష’

కరోనా కాలంలో చితికిపోయినవారికి నిత్యావసరాలు ఉచితంగా అందిస్తూ ఆదుకుంటున్న రైస్‌ ఏటీఎంకు అనుసంధానంగా ప్రారంభించిన ‘పాజెక్టు ప్రిష’ ఆదివారంతో రెండేళ్లు పూర్తి చేసుకుంది.

Published : 30 Jan 2023 03:34 IST

కరోనాతో చితికిన 1,836 కుటుంబాలకు ఉపాధి కల్పన

రైస్‌ ఏటీఎం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో  జొన్నలగడ్డ యశస్విని, దోసపాటి రాము

నాగోలు, న్యూస్‌టుడే: కరోనా కాలంలో చితికిపోయినవారికి నిత్యావసరాలు ఉచితంగా అందిస్తూ ఆదుకుంటున్న రైస్‌ ఏటీఎంకు అనుసంధానంగా ప్రారంభించిన ‘పాజెక్టు ప్రిష’ ఆదివారంతో రెండేళ్లు పూర్తి చేసుకుంది. దీని ద్వారా ఇప్పటివరకు 1,836 కుటుంబాలకు జీవనోపాధి చూపామని ఆ ప్రాజెక్టు నిర్వాహకురాలు జొన్నలగడ్డ యశస్విని తెలిపారు. నాగోలు డివిజన్‌ రాక్‌హిల్స్‌కాలనీలో జరిగిన సంబంధిత వేడుకల్లో భాగంగా.. ఆదివారం 10 మందికి కుట్టుమిషన్లు, టీకొట్లు, తోపుడుబళ్లు అందజేశారు. ఈ సందర్భంగా యశస్విని మాట్లాడుతూ... కరోనా వేళ భర్తలను కోల్పోయి పిల్లలపోషణ భారమైన మహిళలకు ఆర్థికస్వావలంబన కల్పించేందుకు తాముచేసిన కృషి ఫలించిందన్నారు. వారిలో 90 శాతం మంది ప్రస్తుతం విజయపథంలో సాగుతూ తమ కాళ్లపైన తాము నిలబడ్డారన్నారు. రైస్‌ ఏటీఎం నిర్వాహకులు దోసపాటి రాము మాట్లాడుతూ... భర్త చనిపోయాక మెట్టినింటి వారు తరిమేస్తే.. చంటి పిల్లలతో కలిసి సాయం కోసం వచ్చిన ఓ తల్లికి ప్రాజెక్టు ప్రిష సాయంగా నిలిచిందన్నారు. పోషణ భారమై.. కుటుంబానికి బరువనుకున్న మరో ఆడకూతురు.. నేడు ఆ కుటుంబానికి దిక్కై నిలవడానికీ ప్రాజెక్టు ప్రిషనే కారణమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని