logo

సందడిగా ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌ గోల్డెన్‌ జూబ్లీ అలూమ్నీ వేడుక

ఆల్‌ సెయింట్స్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో గోల్డెన్‌ జూబ్లీ అలూమ్నీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 30 Jan 2023 03:34 IST

కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ఆల్‌ సెయింట్స్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో గోల్డెన్‌ జూబ్లీ అలూమ్నీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిజాం క్లబ్‌లో జరిగిన ఈ వేడుకల్లో 1973 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు స్కూలు యూనిఫామ్‌ను పోలిన దుస్తులు ధరించి పాల్గొనడం విశేషం. ఈ పాఠశాలలో చదువుకొని అమెరికా, దుబాయి, యుఏఈ, యూరప్‌ తదితర దేశాల్లో స్థిరపడ్డ డా.జహీరుద్దీన్‌, డా.అనీల్‌రెడ్డి, కలాధర్‌రెడ్డి, కృష్ణ భూపతి, డా.సునీల్‌రెడ్డి, బాఖర్‌ అలీ, ఉదయ్‌రెడ్డి ప్రసంగించారు. దాదాపు 40 ఏళ్ల తరువాత సమావేశమవడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. 1973 పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు, నగర మాజీ మేయరు జుల్ఫీకర్‌అలీతోపాటు సుధాకర్‌, రాజేందర్‌సింగ్‌, కృష్ణ, శ్రీనివాస రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న పూర్వ విద్యార్థులందరికీ సిల్వర్‌ మెడల్స్‌ను బహూకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని