logo

అజాత శత్రువు మురళీమోహన్‌

‘సినీ ప్రపంచంలో అజాత శత్రువుగా 50 ఏళ్లు జీవించడం చాలా కష్టం.. అది ఒక్క మురళీమోహన్‌కే సాధ్యమైంది.’ అని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంధి భవాని ప్రసాద్‌ అన్నారు.

Published : 30 Jan 2023 03:34 IST

మురళీమోహన్‌ను సత్కరిస్తున్న జస్టిస్‌ గ్రంధి భవాని ప్రసాద్‌, చిత్రంలో రేలంగి నరసింహారావు, డా.రంగారావు, వై.వి.ఎస్‌.చౌదరి, సారిపల్లి కొండలరావు, ఆకునూరి శారద, లక్ష్మి తుమ్మల, మహ్మద్‌ రఫీ, ఎస్వీ రామారావు, లంక లక్ష్మినారాయణ

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: ‘సినీ ప్రపంచంలో అజాత శత్రువుగా 50 ఏళ్లు జీవించడం చాలా కష్టం.. అది ఒక్క మురళీమోహన్‌కే సాధ్యమైంది.’ అని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంధి భవాని ప్రసాద్‌ అన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో సారిపల్లి కొండలరావు సారథ్యంలో సినీనటుడు, నిర్మాత, జయభేరి సంస్థల అధినేత, మాజీ ఎంపీ ‘మురళీమోహన్‌ చలనచిత్ర జీవిత స్వర్ణోత్సవ వేడుక’ ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.  మురళీమోహన్‌ను జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. సన్మార్గంలో నడుచుకోవాలనే నవతరానికి మురళీమోహన్‌ జీవితం ఆదర్శమన్నారు. ఇటీవల నైతికత, మానవతా విలువల్ని పక్కనపెట్టి ఎంతకైనా తెగించే మనస్తత్వాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మురళీమోహన్‌ స్పందిస్తూ.. తన సినీ జీవిత ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. దర్శకులు వై.వి.ఎస్‌ చౌదరి, రేలంగి నరసింహరావు,  లక్ష్మి తుమ్మల, కళ పత్రిక సంపాదకుడు మహ్మద్‌ రఫీ, నృత్యకారిణి ఎస్పీ భారతి, ఎస్వీ రామారావు, డా.రంగారావు, గాయని ఆకునూరి శారద మాట్లాడారు. సంస్థ నిర్వాహకులు లంక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని