logo

కాలుష్య నివారణలో సైక్లింగ్‌ కీలక పాత్ర

వాతావరణ కాలుష్య నివారణలో సైక్లింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందని, సైకిల్‌ తొక్కడాన్ని అలవాటుగా మార్చుకోవాలని ఫుడ్‌ సేప్టీ, అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సీఈవో జి.కమలవర్ధన రావు పేర్కొన్నారు.

Published : 30 Jan 2023 03:34 IST

హైటెక్స్‌లో సైక్లోథాన్‌లో ఔత్సాహికులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: వాతావరణ కాలుష్య నివారణలో సైక్లింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందని, సైకిల్‌ తొక్కడాన్ని అలవాటుగా మార్చుకోవాలని ఫుడ్‌ సేప్టీ, అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సీఈవో జి.కమలవర్ధన రావు పేర్కొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం, వరల్డ్‌ సైక్లింగ్‌ అలయన్స్‌ (డబ్ల్యూసీఏ), హైదరాబాద్‌ బైసైక్లింగ్‌ క్లబ్‌ (హెచ్‌బీసీ), స్మార్ట్‌ బైక్‌, ఎస్‌సీఎస్‌సీ, సీఐఐవైఐ, ఆల్‌ ఇండియా బైసైక్లింగ్‌ ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవం సైక్లోథాన్‌ నిర్వహించారు.  మాదాపూర్‌ న్యాక్‌ ప్రాంగణంలో ఆయన జెండా ఊపి సైక్లోథాన్‌ను ప్రారంభించారు.  డబ్ల్యూసీఏ బ్రసెల్స్‌ అధ్యక్షుడు సర్‌ గ్రహం వాట్సన్‌, హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్‌ ఛైర్మన్‌, డబ్ల్యూసీఏ బ్రసెల్స్‌ ఉపాధ్యక్షుడు డీవీ మనోహర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని