logo

నారాయణ సేవా సంస్థాన్‌ సేవలు అభినందనీయం

నారాయణ సేవా సంస్థాన్‌ అందిస్తున్న సేవలు దివ్వాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని సంఘ సేవకుడు కమల్‌నారాయణ్‌ రాఠీ పేర్కొన్నారు.

Published : 30 Jan 2023 03:34 IST

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కమల్‌నారాయణ్‌ రాఠీ, చిత్రంలో గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: నారాయణ సేవా సంస్థాన్‌ అందిస్తున్న సేవలు దివ్వాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని సంఘ సేవకుడు కమల్‌నారాయణ్‌ రాఠీ పేర్కొన్నారు. ఇసామియాబజార్‌లో గల లీలావతి భవన్‌లోని నారాయణ సేవా సంస్థాన్‌ ఆధ్వర్యంలో దివ్వాంగులతోపాటు  యువత, మహిళలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆధునిక సేవా కేంద్రాన్ని ఆదివారం సంస్థాన్‌ కేంద్ర అధ్యక్షుడు ప్రశాంత్‌ అగర్వాల్‌, అల్కా చౌదరి, భారాస నేత గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులతో కలిసి ప్రారంభించారు. స్థానికంగా ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థాన్‌కు చేయూతనందిస్తున్న వారిని సత్కరించారు. సంఘ సేవకులు సురేంద్రమల్‌ లూనియా, సంస్థాన్‌ ప్రతినిధులు జస్మత్‌భాయ్‌ పటేల్‌, ఆర్‌.కె.జైన్‌, డా.మీనా దొదేజా, రోహిత్‌ తివారీ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని