సకల హంగులతో బడులు సిద్ధం కావాలి: కలెక్టర్
మన ఊరు.. మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల అధికారులకు సూచించారు.
చంద్రాయాన్‌పల్లిలో పాఠశాలను పరిశీలిస్తున్న నిఖిల, అధికారులు
న్యూస్‌టుడే, మోమిన్‌పేట: మన ఊరు.. మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని చంద్రాయన్‌పల్లి, అమ్రాదికుర్దు గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల్లో చేపడుతున్న పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొరవడిన వసతులను కల్పించాలనే ఉద్దేశంతో మరమ్మతులు చేపడుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి రాహుల్ శర్మ, డీఈవో రేణుకాదేవి, సర్పంచులు అంజయ్య, సునీత మండల విద్యాధికారి గోపాల్, ఎంపీవో యాదగిరి, ఏఏఈ ప్రణీత్, ప్రధానోపాధ్యాయులు దేవ్యానాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట: మన బడి పనులను అన్ని హంగులతో త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు నిఖిల అన్నారు. సోమవారం మండల పరిధిలోని మాదారం గ్రామంలో ఎంపికైన మోడల్ పాఠశాల పనుల పురోగతిని అదనపు కలెక్టరు రాహుల్‌శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పాఠశాలలను త్వరలో ప్రారంభించబోతున్నామని, మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ డీఈ రాజు, మండల ప్రత్యేకాధికారి నవీన్‌చంద్ర, సర్పంచి అంజయ్య, ఎంఈఓ గోపాల్ తదితరులున్నారు.
సకాలంలో పూర్తి చేయకుంటే ఎలా..
కుల్కచర్ల గ్రామీణ: మనఊరు మనబడి పనులు సకాలంలో పనులు పూర్తి చేయకుంటే ఎలా అని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్ శర్మ, జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి ప్రశ్నించారు. ముజాహిద్‌పూర్ ప్రాథమిక పాఠశాలను సోమవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. శౌచాలయాల నిర్మాణం, వంటగది, పనులు అసంపూర్తిగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. శౌచాలయ పనులు ఒక్క రోజులో పూర్తి చేస్తారా అని అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. కార్యక్రమంలో సర్పంచి లక్ష్మి, ఉప సర్పంచి చంద్రభూపాల్ రావు, ఎంపీడీవో నాగవేణి, మండల విద్యాధికారి అబీబ్ అహ్మద్, ఎంపీవో కరీమ్, పంచాయతీ కార్యదర్శి విజయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Cyber Crime: వామ్మో.. స్కామ్ కాల్స్‌తో 53 బిలియన్ డాలర్లు కొల్లగొట్టారా?
-
World News
Sheikh Hasina: మా పోర్టులు భారత్ వాడుకోవచ్చు: హసీనా
-
Politics News
Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!