logo

కొరవడిన ప్రోత్సాహం.. కనిపించని చైతన్యం!

జిల్లాలో నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాలు రోజురోజుకీ కనుమరుగవుతున్నాయి.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ  పథకాలు, కార్యక్రమాల విజయవంతంలో, జన బాహుళ్యాన్ని చైతన్యం చేయడంలో యువకుల పాత్ర ఎనలేనిది.

Published : 31 Jan 2023 01:05 IST

మొక్కుబడిగా నెహ్రూ యువ కేంద్రాలు

మిట్టకోడూరులో మురుగు కాల్వను శుభ్రం చేస్తున్న యువకులు

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాలు రోజురోజుకీ కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ  పథకాలు, కార్యక్రమాల విజయవంతంలో, జన బాహుళ్యాన్ని చైతన్యం చేయడంలో యువకుల పాత్ర ఎనలేనిది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ సంఘాలకు గుర్తింపు లేక వారిలో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలముకుంటున్నాయి. జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇదే పరిస్థితి నెలకొంది.


అమలు ఎక్కడ..

వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజక వర్గాల పరిధిలో 250 గుర్తింపు పొందిన సంఘాలు ఎన్‌వైకె కింద నమోదై ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వీటి సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంది. దాదాపు 3,658 మంది సభ్యులున్నారు. క్షేత్ర స్థాయిలో సహకారం అందక చివరకు వాటి ఉనికే ప్రశ్నార్థకమైంది.

* యువతకు నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం పెంపొందిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి. గ్రామాల్లో తరచూ వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, వ్యక్తిత్వ వికాసం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం దేశాభివృద్ధికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం యువ కేంద్రం లక్ష్యాలు. కానీ ఇవి అమలు కావడం లేదు. కనీసం మండల స్థాయిలో లేదంటే గ్రామ స్థాయిలో కూడా యువతకు క్రీడా పోటీలు నిర్వహించడంలేదు.


రెండింటి లక్ష్యాలూ ఒకటే..

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన సర్వీసుల శాఖ పనిచేస్తోంది. రెండింటి లక్ష్యాలు దాదాపుగా ఒక్కటే. కొన్నేళ్లుగా సంఘాలకు దిశానిర్దేశం లేకుండా పోయింది. జిల్లా వేరు పడడంతో సంఘాలకు ఎన్‌వైకె నుంచి దాదాపు లింకు తొలగిపోయింది. నేటికీ అది ఉమ్మడి జిల్లాకే ప్రాతినిథ]్యం వహిస్తోంది. సంబంధిత అధికారుల నుంచి మాత్రం సంఘాలకు ఎలాంటి సమాచారం అందడం లేదు.


ఉమ్మడి జిల్లా పరిధిలోనే: హనుమంతరావు, జిల్లా క్రీడలు, యువజన సంక్షేమాధికారి

ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఎన్‌వైకె కార్యాలయం ఉంది. ప్రత్యేకించి వేరు పడితేనే జిల్లాకు ప్రయోజనం. ఇటీవలి కాలంలో జిల్లా కేంద్రంలో ఎయిడ్స్‌పై అవగాహన, కబడ్డీ పోటీలు నిర్వహించాం. తమవంతుగా యువతను ప్రోత్సహిస్తున్నాం.


ఇలా చేస్తే బాగు

* నూతనంగా ఏర్పడిన జిజిల్లాలో ఎన్‌వైకె కార్యక్రమాలు అమలు చేయాలి
* సమాజ సేవ చేస్తున్న సంఘాలకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి * మండల, తాలుకా స్థాయిలో కెరీర్‌ గైడెన్స్‌ శిక్షణ  అవసరం * అన్ని సంఘాలకు క్రీడా పరికరాల మంజూరు * అభివృద్ధి పనుల్లోనూ భాగస్వామ్య కల్పన * క్షేత్ర స్థాయిలో సంఘాలను ప్రోత్సహించే కార్యక్రమాల అమలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని