logo

మట్టిలో ఇరుక్కుని.. కదల్లేక...

ఎదురుగా వస్తున్న టిప్పర్‌కు దారి ఇవ్వబోయి మట్టిలోకి జారిన ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది.

Published : 31 Jan 2023 01:05 IST

నాగిరెడ్డిపల్లిగేటు సమీపంలో బస్సు ఇలా..

నవాబ్‌పేట: ఎదురుగా వస్తున్న టిప్పర్‌కు దారి ఇవ్వబోయి మట్టిలోకి జారిన ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రయాణికులను వేరే బస్సులో వారి గమ్యాలకు చేర్చారు. ప్రయాణికుల, సిబ్బంది వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం శంకర్‌పల్లి నుంచి వికారాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిగేటు  దగ్గరకు వస్తోంది. ప్రస్తుతం నవాబుపేట-వికారాబాద్‌ ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. మట్టిలోడుతో ఎదురుగా వస్తున్న టిప్పర్‌కు సైడ్‌ ఇవ్వబోగా, బస్సు చక్రాలు మట్టిలో కూరుకుపోయాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేసి పరిశీలించారు. బస్సు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో అక్కడే ఉంచి బస్సులో ఉన్న సుమారు 20 మంది ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు