రుణాల మాటున అక్రమాలు
శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో రత్న అనే ఓ రిసోర్స్ పర్సన్ నకిలీ డ్వాక్రా సంఘాలను సృష్టించింది.
నకిలీ డ్వాక్రా సంఘాలు సృష్టించి రూ.80లక్షల స్వాహా!
శంషాబాద్‌లో బ్యాంకు అధికారులను నిలదీస్తున్న మహిళలు
శంషాబాద్, న్యూస్‌టుడే: శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో రత్న అనే ఓ రిసోర్స్ పర్సన్ నకిలీ డ్వాక్రా సంఘాలను సృష్టించింది. కొందరు బ్యాంకు, మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ రుణాలను కాజేసింది. ఈ అక్రమ బాగోతం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగుతోంది. ఆందోళనకు గురైన మహిళలు సోమవారం బ్యాంకులను ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. మహిళా సంఘాల రుణాలపై పూర్తి స్థాయిలో విచారించి న్యాయం చేస్తామని బ్యాంకుల అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు. అమాయక మహిళల పేర్లతో రూ.20 లక్షలకు పైగా రుణాలను రత్న తీసుకుని మోసాలకు పాల్పడిందని జిల్లా కలెక్టర్‌కు మహిళా సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, యూనియన్ తదితర బ్యాంకుల్లో నకిలీ గ్రూపులు సృష్టించి రూ.80 లక్షల వరకు రుణాలు కాజేసిందని డ్వాక్రా మహిళా సంఘం ప్రతినిధి వెంగారెడ్డి కమలమ్మ ఆరోపించారు. రిసోర్స్ పర్సన్ రత్న అక్రమాలకు పాల్పడినట్లు మా దృష్టికి వచ్చిందని మున్సిపల్ అధికారి శివశంకర్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Vijayawada: అసాధారణంగా సీఏల అరెస్టులు: ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్
-
General News
MLC Kavitha: డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే పెద్ద ఉద్యోగం: ఎమ్మెల్సీ కవిత
-
Movies News
Rishab Shetty: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ‘కాంతార’ హీరో
-
Crime News
Jangareddygudem: కత్తితో దంపతులు, కుమారుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
-
India News
Kapil Sibal: సుపారీ ఇచ్చినవారి పేర్లు చెప్పండి..! ప్రధాని మోదీకి కపిల్ సిబల్ విజ్ఞప్తి
-
Movies News
Samantha: చీకటి రోజులు.. ఆ బాధ నుంచి నేనింకా కోలుకోలేదు.. విడాకుల రోజులపై సమంత వ్యాఖ్యలు