నిల్చొనే సంతకాలు.. వసతుల్లేక వెతలు
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే కీలక శాఖ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు. అదే స్థాయిలో సౌకర్యాలతో ఉండాల్సిన సంబంధిత కార్యాలయాలు మాత్రం భిన్న పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి.
రైటర్ కార్యాలయాలే దిక్కు.. దళారులదే దర్జా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దుస్థితి
కూకట్‌పల్లి కార్యాలయంలో తిప్పలు ఇలా..
ఈనాడు - హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే కీలక శాఖ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు. అదే స్థాయిలో సౌకర్యాలతో ఉండాల్సిన సంబంధిత కార్యాలయాలు మాత్రం భిన్న పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. సంతకాలు పెట్టేవారికి కుర్చీ, టేబుల్ కూడా కానరావు. నిల్చొని సంతకాలు పెట్టడం, సరైన బల్లలు లేకపోవడంతో పత్రాలు కింద పడిపోవడం.. సంతకాలు సరిగా టాలీ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లోనే సంతకాలు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులే దళారులను ఆశ్రయించడానికి కారణమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయానికి వెళ్లేవారికి దళారులే స్వాగతం పలికి.. డాక్యుమెంట్ రైటర్ కార్యాలయంలో కూర్చోబెట్టి, పనులన్నీ అయ్యే దాకా వెంట ఉండి కావాల్సినంత దండుకొని పంపిస్తున్నారు.
ప్రైవేటు భవనాల్లోనే..
రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో 41 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా 90 శాతం ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వినియోగదారుల(స్థిరాస్తి కొన్నవారు.. అమ్మేవారు) నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.కోట్లలో ఆదాయం ఏటా సమకూరుతుంది. రాసుకునేందుకు, డాక్యుమెంట్లపై సంతకాలు చేసేందుకు టేబుళ్లు.. ఇలా కార్పొరేట్ కార్యాలయం మాదిరి సౌకర్యాలు కల్పించాల్సిన ఈ శాఖ కార్యాలయాల్లో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు. కనీసం కూర్చునే చోటు లేక.. కార్యాలయం బయట రోడ్డుమీద ఆపిన కార్లలో వినియోగదారులు ఉంటే.. డాక్యుమెంట్ రైటర్, కార్యాలయ సిబ్బంది వారి వద్దకు వెళ్లి సంతకాలు తీసుకునే పరిస్థితి ఉంది.
వాహనాలు నిలపాలన్నా కష్టమే..
అద్దె భవనాల్లో ఉన్నా.. వందలాదిగా వచ్చే వినియోగదారుల వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి. పార్కింగ్ కూడా లేని భవనాల్లో, రోడ్డును ఆనుకుని ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దూరంగా వాహనాలు పెట్టుకుని వస్తున్నారు. కార్యాలయాలకు ఎదురుగా అంతటా ద్విచక్రవాహనాలు నిలిపి ఉంచడంతో నడిచి వెళ్లడానికి కూడా వీల్లేని పరిస్థితి. బయట నుంచి చూస్తే కార్యాలయ బోర్డు కూడా సరిగా కనిపించదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rishab Shetty: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ‘కాంతార’ హీరో
-
Crime News
Jangareddygudem: కత్తితో దంపతులు, కుమారుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
-
India News
Kapil Sibal: సుపారీ ఇచ్చినవారి పేర్లు చెప్పండి..! ప్రధాని మోదీకి కపిల్ సిబల్ విజ్ఞప్తి
-
Movies News
Samantha: చీకటి రోజులు.. ఆ బాధ నుంచి నేనింకా కోలుకోలేదు.. విడాకుల రోజులపై సమంత వ్యాఖ్యలు
-
Sports News
IPL 2023: టోర్నీలోని మిగతా మ్యాచుల్లో కేన్ విలియమ్సన్ ఆడడు: గుజరాత్ టైటాన్స్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు