logo

‘ప్రజా చైతన్యానికి కేబుల్‌ ఆపరేటర్‌ వ్యవస్థ వారధి’

ప్రజల్లో చైతన్యం పెరగడానికి కేబుల్‌ ఆపరేటర్‌ వ్యవస్థ ఒక వారధిలా పనిచేస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 31 Jan 2023 04:10 IST

మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చిత్రంలో సాగర్‌, అంజిరెడ్డి, కోటి, రమేశ్‌, కిషోర్‌ తదితరులు

రాంనగర్‌, న్యూస్‌టుడే: ప్రజల్లో చైతన్యం పెరగడానికి కేబుల్‌ ఆపరేటర్‌ వ్యవస్థ ఒక వారధిలా పనిచేస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద మినిస్టర్‌ ఆఫ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ సూచనల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా న్యూ టారిఫ్‌ ఆర్డర్‌ 3ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. వారికి మద్దతు తెలిపిన శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేబుల్‌ టీవీ కస్టమర్‌లపై వినోదపు భారం గతం కంటే తగ్గే విధంగా కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చేలా డిమాండ్‌ చేస్తామన్నారు. ట్రాయ్‌ అసంబద్ద విధానాలతో ధరలను పెంచుతున్నారని దుయ్యబట్టారు. కేబుల్‌ ఆపరేటర్లకు గుర్తింపు కార్డులను అందజేస్తామన్నారు. టీఫైబర్‌ ప్రాజెక్టులో కేబుల్‌ ఆపరేటర్లకు భాగస్వామ్యం కల్పించి ప్రతిఇంటికి టీ ఫైబర్‌ సేవలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.సంఘం నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు