logo

‘అనాథల సంరక్షణ బాధ్యత సర్కారుదే’

అనాథ పిల్లలకు అమ్మ, నాన్న ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలుపుకొని మానవత్వం చాటుకోవాలని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

Published : 31 Jan 2023 04:10 IST

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

కవాడిగూడ: అనాథ పిల్లలకు అమ్మ, నాన్న ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలుపుకొని మానవత్వం చాటుకోవాలని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. అనాథ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవారం ధర్నాచౌక్‌లో 777 మూవ్‌మెంట్‌ అనాథ పిల్లల అరిగోస దీక్ష చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అనాథ పిల్లలు దీక్షలో పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతా సిన్హా, తె.తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, భాజపా ప్రతినిధి విజయ, ఆప్‌ ప్రతినిధి ఇందిరా శోభన్‌, వైతెపా ప్రతినిధి ఏపూరి సోమన్న, వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్‌గౌడ్‌, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ సతీష్‌ మాదిగ, అనాథ హక్కుల పోరాట వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటయ్య, కృష్ణవేణి తదితరులు సంఘీభావం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని