logo

ఐటీ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం మరింత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Published : 31 Jan 2023 04:10 IST

కంపెనీ ప్రారంభోత్సవంలో జ్యోతి వెలిగిస్తున్న మంత్రి కేటీఆర్‌

కార్ఖానా, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం మరింత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఐటీ సంస్థలు స్థాపించే వారికి ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని వెల్లడించారు. బేగంపేటలో నూతనంగా ఏర్పాటైన కోడ్‌ ఆక్యూటీ కంపెనీని ఆయన సోమవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్‌ నగరానిది ప్రత్యేక స్థానమని, ఇక్కడి యువత ఈ రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, డైరక్టర్‌ కె.దిలీప్‌, కోడ్‌ ఆక్యూటీ సీఈవో అనుదీప్‌ కాటన్‌ గోరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని