logo

మన ఊరు - మనబడి.. సరికొత్త ఒరవడి

మన ఊరు -మనబడి కింద ఎంపికైన పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. మంత్రుల చేతుల మీదుగా ఫిబ్రవరి ఒకటో తేదీ (నేటి) నుంచి వీటికి శ్రీకారం చుట్టనున్నారు.

Published : 01 Feb 2023 01:15 IST

ప్రారంభానికి 13 పాఠశాలలు సిద్ధం
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, వికారాబాద్‌ గ్రామీణ  

మిట్టకోడూరులో ముస్తాబైన పాఠశాల

న ఊరు -మనబడి కింద ఎంపికైన పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. మంత్రుల చేతుల మీదుగా ఫిబ్రవరి ఒకటో తేదీ (నేటి) నుంచి వీటికి శ్రీకారం చుట్టనున్నారు.

మొత్తం 371 ఎంపిక

జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1058 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు -మన బడి కింద 371 పాఠశాలలను రూ.6.94కోట్ల వ్యయంతో చేపట్టారు. వీటిలో తొలి విడతగా 37 ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేసి వాటిలో ఇప్పటివరకు 13 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధం చేశారు. వాటిలో.. చట్టంపల్లి తండా, చౌడాపూర్‌ మండలం కొత్తపల్లి, దోమ మండలం శివారెడ్డిపల్లి, దౌల్తాబాద్‌ మండలం నర్సాపూర్‌, కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌, మోమిన్‌పేట మండలం చంద్రాయన్‌పల్లి, అమ్రాద్‌కుర్దు, నవాబుపేట మండలం మాదారం, పరిగి మండలం కాళ్లాపూర్‌, పెద్దేముల్‌ మండలం కందనెల్లి, పూడూరు మండలం మన్నెగూడ, తాండూరు మండలం గౌతాపూర్‌, యాలాల మండలం దేవనూర్‌ పాఠశాలలు ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి.
* రూ.30లక్షలకు పైబడి ఉన్నవి 102, అంతకంటే తక్కువగా నిధులు ఖర్చయ్యేవి 269 పాఠశాలలు ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు.

వేగంగా సాగేందుకు..

మనబడి పథకం వేగంగా సాగేందకు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పనులపై విడతల వారీగా సమీక్షించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాణంలో ఉన్న వాటిని కూడా పూర్తిచేసేందుకు అధికారులు గుత్తేదారులను పరుగులు పెట్టిస్తున్నారు. పనుల్లో వేగిరత తీసుకువచ్చేందుకు స్వయంగా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ఆయా పాఠశాలలను సందర్శించారు. ఇంజినీరింగ్‌ అధికారులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను నిత్యం పరిశీలిస్తున్నారు. రూ.30లక్షలకు పైబడి ఉన్నవాటిని కూడా టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు.


కార్పొరేట్‌కు ధీటుగా మారుస్తాం
- రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

సర్కారు బడుల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించి కార్పొరేట్‌కు ధీటుగా మారుస్తాం. పనులు పూర్తయిన పాఠశాలలను పరిశీలిస్తే ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, పిల్లల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఆయా మండలాల్లో 13పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేశాం. మిగతా వాటిని కూడా త్వరగా పూర్తిచేసేందుకు మరింత చొరవ తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని