logo

రాజా విక్రమాదిత్య చరిత్రను ప్రపంచానికి చెప్పాలి

రాజా విక్రమాదిత్య చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాలని  మధ్యప్రదేశ్‌ రాష్ట్ర  ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ అన్నారు.

Published : 01 Feb 2023 02:34 IST

సమావేశంలో మాట్లాడుతున్న  డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌, పక్కన మురళీధర్‌రావు

జీడిమెట్ల, న్యూస్‌టుడే: రాజా విక్రమాదిత్య చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాలని  మధ్యప్రదేశ్‌ రాష్ట్ర  ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం నగరంలోని చింతల్‌ హెచ్‌ఎంటీ మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన భాజపా మధ్యప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. సామ్రాట్‌ విక్రమాదిత్య ఉత్సవ్‌-2023 పేరుతో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నాటక ప్రదర్శనలను ఇక్కడి మైదానంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో భాజపా నేతలు జయశ్రీ, పన్నాల హరీశ్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని