logo

దక్కన్‌మాల్‌ కూల్చివేత 60 శాతం పూర్తి

సికింద్రాబాద్‌ మినిస్టర్‌రోడ్డులో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన దక్కన్‌మాల్‌ భవనాన్ని 60శాతం మేరకు నేలమట్టం చేశారు. ఆరో అంతస్తు నుంచి కింద వరకు కొంతకొంతగా కూలుస్తూ వస్తున్నారు.

Published : 01 Feb 2023 02:34 IST

భవనం కూల్చివేస్తున్న చిత్రాలు..

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ మినిస్టర్‌రోడ్డులో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన దక్కన్‌మాల్‌ భవనాన్ని 60శాతం మేరకు నేలమట్టం చేశారు. ఆరో అంతస్తు నుంచి కింద వరకు కొంతకొంతగా కూలుస్తూ వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత వెనుక వైపు మిగిలిఉన్న భాగంలో పిల్లర్లను మరింత బలహీనపరిచి సాంకేతికంగా ఒకేసారి కూల్చేశారు. దీంతో భవనం ఉన్నచోట అలాగే కూలిపోయింది. భవనం కుప్పకూలడంతో పెద్దఎత్తున దుమ్ము, ధూళి వెలువడింది. ఇప్పటివరకు భవనం 60శాతం వరకు కూలిపోయింది. కుడి వైపు భాగం భవనం అలాగే ఉంది. రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని మాలిక్‌ ట్రేడింగ్‌, డీమాలిషన్‌ సంస్థ ఇంజనీరు షరీఫుద్దీన్‌ తెలిపారు.

భారీగా లేచిన దుమ్ము

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని