logo

కేఏ పాల్‌ గృహ నిర్బంధం

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఈ నెల 17న ప్రారంభించడాన్ని నిరసిస్తూ సచివాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించేందుకు బయలుదేరిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ను పంజాగుట్ట పోలీసులు మంగళవారం గృహ నిర్బంధం చేశారు.

Published : 01 Feb 2023 02:34 IST

పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ హరిశ్చంద్రారెడ్డితో మాట్లాడుతున్న కేఏ పాల్‌

పంజాగుట్ట, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఈ నెల 17న ప్రారంభించడాన్ని నిరసిస్తూ సచివాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించేందుకు బయలుదేరిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ను పంజాగుట్ట పోలీసులు మంగళవారం గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ పుట్టిన రోజు ఏప్రిల్‌ 14న ఉండగా, కేసీఆర్‌ పుట్టిన రోజున ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున ఆయన పుట్టిన రోజునే ప్రారంభిస్తే బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.సర్పంచులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధిపథం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని పాల్‌ సూచించారు. తనను గృహనిర్బంధం చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని