logo

ధర్మం కోసం చావడానికైనా సిద్ధం

‘‘ధర్మం కోసం పోరాటం చేస్తున్న నన్ను మళ్లీ జైలుకు పంపిస్తారా..? లేక తెలంగాణ నుంచి బహిష్కరిస్తారా చూద్దాం.. దేనికైనా సిద్ధంగా ఉన్నా’’నంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published : 01 Feb 2023 02:34 IST

రాజాసింగ్‌కు మంగళ్‌హాట్‌ పోలీసులు మరో నోటీసు
భయపడేది లేదంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ‘‘ధర్మం కోసం పోరాటం చేస్తున్న నన్ను మళ్లీ జైలుకు పంపిస్తారా..? లేక తెలంగాణ నుంచి బహిష్కరిస్తారా చూద్దాం.. దేనికైనా సిద్ధంగా ఉన్నా’’నంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెల 29న ముంబయిలోని దాదర్లో జరిగిన జనాక్రోశ్‌ మోర్చా ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌కు మంగళ్‌హాట్‌ పోలీసులు సోమవారం అర్ధరాత్రి మరో నోటీసు జారీ చేశారు. జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై స్పందించిన రాజాసింగ్‌ మంగళవారం రెండు వీడియోలు విడుదల చేశారు. ‘‘బెంగళూరు హైకోర్టులో ఓ కేసుకు సంబంధించి హాజరయ్యేందుకు ప్రస్తుతం ఇక్కడికి వచ్చా. తెలంగాణలో 8వ నిజాం ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వం, దానికి గులాంగిరీ చేస్తున్న పోలీసు అధికారులకు చెప్పేది ఒక్కటే. ధర్మం కోసం పోరాటం చేస్తున్నా. లవ్‌ జిహాద్‌, మతమార్పిడి, గోహత్యలపై చట్టం తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నా. దీనికి మీకెందుకు అంత బాధ’’ అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు