logo

Driving Licence: అలా చేస్తే ఇబ్బందులు తప్పవు

తస్మాత్‌ జాగ్రత్త.. డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెన్షన్‌లో ఉన్నా సరే.. బండి బయటకు తీస్తున్నారా.. క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కున్నట్లే. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల లైసెన్సును 3-6 నెలలపాటు ఆర్టీఏ అధికారులు రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 01 Feb 2023 09:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: తస్మాత్‌ జాగ్రత్త.. డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెన్షన్‌లో ఉన్నా సరే.. బండి బయటకు తీస్తున్నారా.. క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కున్నట్లే. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల లైసెన్సును 3-6 నెలలపాటు ఆర్టీఏ అధికారులు రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. లైసెన్సు సస్పెన్షన్‌లో ఉన్నా సరే చాలామంది డ్రైవింగ్‌ చేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే ఇలాంటి వారు క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతేడాది హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో దాదాపు 11 వేల లైసెన్సుల వరకు రద్దు చేశారు. అయినా మళ్లీ డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారు.

ఒకే వ్యక్తి లైసెన్సు గరిష్ఠంగా 3 సార్లు రద్దయితే.. తర్వాత దానిని శాశ్వతంగా రద్దు చేస్తామని, జైలు శిక్షలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ జేటీసీ పాండురంగనాయక్‌ తెలిపారు. లైసెన్సు సస్పెన్షన్‌కు గురైతే అది అధికారికంగా రికార్డుల్లో నమోదు అవుతుంది. దీంతో అంతర్జాతీయ లైసెన్సులు తీసుకోవాలనుకొనే వారికి సమస్యగా మారుతుందని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల రవాణాశాఖాధికారి ప్రవీణ్‌రావు వివరించారు. విద్యార్థులు, ఉద్యోగాలకు చదివేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తాగి బండి నడుపుతూ ఇతరుల మృతికి కారణమైతే సెక్షన్‌ 304 కింద క్రిమినల్‌ కేసుతోపాటు.. లైసెన్సును పూర్తిగా రద్దు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు