logo

ఆగిన జనన ధ్రువపత్రాల జారీ

ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి నగరంలోని తల్లిదండ్రులకు శాపంగా మారింది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతికి గ్రేటర్‌లోని మెజార్టీ పాఠశాలలు ప్రవేశాలు ఇస్తున్న సమయమిది.

Published : 01 Feb 2023 03:04 IST

పాఠశాలల్లో దరఖాస్తుకు తల్లిదండ్రుల అవస్థ

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి నగరంలోని తల్లిదండ్రులకు శాపంగా మారింది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతికి గ్రేటర్‌లోని మెజార్టీ పాఠశాలలు ప్రవేశాలు ఇస్తున్న సమయమిది. విద్యార్థి జనన ధ్రువపత్రం, ఆధార్‌కార్డులతో వస్తే.. వివరాలు ఆరా తీసి అడ్మిషన్‌ ఇస్తామని పాఠశాలలు ప్రకటించాయి. కానీ.. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం తల్లిదండ్రుల ఆశను నీరుగార్చింది. నాలుగు రోజులుగా మీసేవా కేంద్రాల్లో జనన, మరణ ధ్రువపత్రాల సేవలు నిలిచిపోవడమే అందుకు కారణం.

* గతంలో పౌర సేవా కేంద్రాల్లో జనన, మరణ ధ్రువపత్రాలు ఇచ్చేవారు. మీసేవా కేంద్రాలకు ద్వారా సేవలందించే నూతన విధానాన్ని రెండేళ్ల క్రితం తెరపైకి తెచ్చారు. నాలుగు రోజులుగా మీసేవా కేంద్రాల్లో జనన, మరణ ధ్రువపత్రాల సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని మీసేవా కేంద్రాల నిర్వాహకులు బల్దియా ఐటీ విభాగం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. జీహెచ్‌ఎంసీకి చెందిన మూడు రకాల సేవలు ప్రస్తుతం ‘మీసేవా’ వద్ద ఉన్నాయి. ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్సు, జనన-మరణ ధ్రువపత్రాలు అందులో ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా బల్దియా ఐటీ విభాగం ధ్రువపత్రాల సేవలను నిలిపేసిందనే విమర్శలూ ఉన్నాయి. మూడింటినీ ఒకేసారి నడిపిస్తే.. సర్వర్‌పై భారం పడుతుందనే కారణంతో ఉన్నతాధికారులు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. కేంద్ర కార్యాలయం ట్రేడ్‌ లైసెన్సు, ఆస్తిపన్ను వసూళ్లపైనే దృష్టిపెట్టిందని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని