logo

దేశ ప్రగతికి దోహదపడేలా కేంద్ర బడ్జెట్‌: డీకే అరుణ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2023 (Budget 2023) బడుగు బలహీన వర్గాలకు ఊతమివ్వడంతోపాటు దేశ ప్రగతికి దోహదపడే విధంగా ఉందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే హర్షం వ్యక్తం చేశారు.

Published : 01 Feb 2023 15:55 IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2023 (Budget 2023) బడుగు బలహీన వర్గాలకు ఊతమివ్వడంతోపాటు దేశ ప్రగతికి దోహదపడే విధంగా ఉందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు. రైతుల అభ్యున్నతి కోసం రూ.20లక్షల కోట్ల రుణాలు ఇవ్వడంతో పాటు శ్రీఅన్న పథకం ద్వారా చిరు ధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహం ఇస్తూ హరిత అభివృద్ధి వైపు నడిపించే నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనను ఈ బడ్జెట్‌ వేగవంతం చేస్తుందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 79వేల కోట్లు కేటాయించడం గర్వకారణమని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని