logo

మురిసిన బడి..సరికొత్త సవ్వడి

మనబస్తీ.. మనబడి కార్యక్రమం నగరంలో బుధవారం ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, టి.హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సి.మల్లారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Published : 02 Feb 2023 06:45 IST

నగరంలో ఉత్సాహంగా మనబస్తీ..మనబడి

నూతన గదులు.. ఆధునిక వసతులు  ప్రారంభించిన మంత్రులు

కందుకూరు మండలం రాచులూరులో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి సబితారెడ్డి, చిత్రంలో విద్యాశాఖ  డైరెక్టర్‌ దేవసేన, కార్యదర్శి కరుణ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: మనబస్తీ.. మనబడి కార్యక్రమం నగరంలో బుధవారం ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, టి.హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సి.మల్లారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రగతినగర్‌లో మంత్రి హరీశ్‌రావు, లేమూరులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజ్‌భవన్‌ ప్రాథమిక పాఠశాల, పికెట్‌, మైలార్‌గూడ ప్రాథమిక పాఠశాలల్లో మంత్రి తలసాని,  పోచారం, మేడిపల్లి పాఠశాలల్లో మంత్రి మల్లారెడ్డిలు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు సమకూర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రులు తెలిపారు. ప్రవేశాల కోసం కార్పొరేటు స్కూళ్లకు వెళ్లినట్టే... ప్రభుత్వ పాఠశాలలకూ తల్లిదండ్రులు వస్తున్నారని వివరించారు.

సౌకర్యంగా ఉన్నాయా? లేవా?

కార్యక్రమంలో భాగంగా మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు పాఠశాలల్లోని మౌలిక వసతులు, శౌచాలయాలను పరిశీలించారు. తరగతి గదులు సౌకర్యంగా ఉన్నాయా? లేదా?, మధ్యాహ్న భోజనం బాగుందా?లేదా? అంటూ విద్యార్థులను అడిగారు. మధ్యాహ్న భోజనం బాగోలేకపోతే ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయాలంటూ సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి మధ్యాహ్న భోజనం రుచిచూపించాలని ఉపాధ్యాయులకు సూచించారు.  భోజన గదులు, శౌచాలయాలు శుభ్రంగా ఉండాలని, కార్పొరేట్‌ పాఠశాలల తరహాలోనే అన్ని పాఠశాలల్లో బోర్డులు మార్పిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని