logo

కంటోన్మెంట్‌కు రూ.10 కోట్లు

రక్షణ శాఖ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు రూ.10 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా అందజేసింది.  దేశంలోని 46 కంటోన్మెంట్లకు మొత్తం రూ.190.66 కోట్లు ఇవ్వగా.. అందులో సికింద్రాబాద్‌కు రూ.10 కోట్లు దక్కాయి.

Published : 02 Feb 2023 02:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ శాఖ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు రూ.10 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా అందజేసింది.  దేశంలోని 46 కంటోన్మెంట్లకు మొత్తం రూ.190.66 కోట్లు ఇవ్వగా.. అందులో సికింద్రాబాద్‌కు రూ.10 కోట్లు దక్కాయి. 2022లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద మొత్తం రూ.177 కోట్లు ఇవ్వగా.. అప్పుడు సికింద్రాబాద్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కంటోన్మెంట్‌ బోర్డు సరిగా లెక్కలు చెప్పక, రశీదులు పెట్టకపోవడంతోనే సికింద్రాబాద్‌కు అన్యాయం జరుగుతోందని స్థానిక ప్రజాసంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు