శాసనసభ సమావేశాలు.. 3 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
శాసనసభ సమావేశాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి ఆదివారాలు మినహా సమావేశాలు ముగిసే వరకూ.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు బుధవారం తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్: శాసనసభ సమావేశాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి ఆదివారాలు మినహా సమావేశాలు ముగిసే వరకూ.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు బుధవారం తెలిపారు. ఆయా సమయాల్లో వాహనాల నిలుపుదలతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంక్షలు అమలులో ఉండే మార్గాలు
*తెలుగుతల్లి- ఇక్బాల్ మినార్ - రవీంద్రభారతి- వి.వి.విగ్రహం- షాదన్‌కళాశాల- నిరంకారి- సైఫాబాద్ పాతపోలీస్‌స్టేషన్- మాసబ్‌ట్యాంక్- పీటీఐ బిల్డింగ్-అయోధ్య, నిరంకారి-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్- బషీర్‌బాగ్ జంక్షన్ టు ఓల్డ్ పీసీఆర్ జంక్షన్, బీజేఆర్ విగ్రహం- ఏఆర్ పెట్రోల్‌పంప్- నాంపల్లి రైల్వేస్టేషన్- ఎంజేమార్కెట్- తాజ్ ఐలాండ్- బీఆర్‌కే భవన్- ఆదర్శ్‌నగర్- ఓల్డ్ పీసీఆర్ జంక్షన్- మినిస్టర్స్ రెసిడెన్సీ కాంప్లెక్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12- విరంచి హాస్పిటల్- మాసబ్‌ట్యాంక్ ః జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు-కేబీఆర్‌పార్క్-ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్- శ్రీనగర్ కాలనీ జంక్షన్- నిమ్స్ - వి.వి.విగ్రహం ః ఈఎస్‌ఐ ఆసుపత్రి- ఎస్.ఆర్.నగర్ మెట్రోస్టేషన్-అమీర్‌పేట్ స్టేషన్- పంజాగుట్ట జంక్షన్- నిమ్స్- వి.వి.విగ్రహం ః సీటీవో జంక్షన్- ప్యారడైజ్- రాణిగంజ్- కర్బలా- చిల్డ్రన్‌పార్క్- ట్యాంక్‌బండ్- అంబేడ్కర్ విగ్రహం-తెలుగుతల్లి -ఇక్బాల్‌మినార్-రవీంద్రభారతి ః ప్లాజా జంక్షన్- ప్యాట్నీ- బాటా- బైబిల్‌హౌస్- కర్బలా ప్రాంతాల్లో అమలులో ఉంటాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్