అంత్యక్రియలకు వెళ్తూ ప్రమాదంలో మహిళ మృతి
అమ్మ చనిపోయిందనే విషయం తెలియడంతో ఎంతో ఆవేదనతో కుటుంబ సభ్యులు వెళ్తుండగా విధి వక్రీకరించింది.
రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: అమ్మ చనిపోయిందనే విషయం తెలియడంతో ఎంతో ఆవేదనతో కుటుంబ సభ్యులు వెళ్తుండగా విధి వక్రీకరించింది. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో బాహ్య వలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రాజేంద్రనగర్ ఎస్సై ఖలీల్ పాషా తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా నీలంగా ప్రాంతానికి చెందిన వెంకటగణపతి(45) విశాఖపట్నంలో రక్షణ శాఖ ఉద్యోగి. స్వగ్రామంలో మాతృమూర్తి చనిపోవడంతో మంగళవారం విశాఖపట్నం నుంచి భార్య జయశ్రీ(40), ఇద్దరు పిల్లలు విరాట్(11), శ్రియ(9)తో విమానంలో శంషాబాద్‌కు చేరుకున్నారు. వారిని శంషాబాద్ నుంచి కారులో తీసుకెళ్లడానికి వెంకటగణపతి బావమరది సతీష్ సోలంకి, డ్రైవర్ ముస్తఫాషేక్‌తో కలిసి మహారాష్ట్ర నుంచి వచ్చాడు. అంతా కలిసి స్వగ్రామానికి బయలుదేరగా బాహ్యవలయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో జయశ్రీ, డ్రైవర్ ముస్తఫాషేక్ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన నలుగురు గాయపడ్డారు. వెంకటగణపతి పరిస్థితి విషమంగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్