Hyderabad: అమ్మా.. ఎక్కడున్నా త్వరగా రా!: తల్లికోసం పోలీసులను ఆశ్రయించిన చిన్నారులు
అమ్మా.. నువ్వు ఎక్కడున్నా త్వరగా రా.. నువ్వు వెళ్లినప్పటి నుంచి నాన్న ఇటు వైపు రాలేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. అంటూ ఇద్దరు చిన్నారులు తమ తల్లి కోసం జూబ్లీహిల్స్ ఠాణా మెట్లు ఎక్కారు.
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: అమ్మా.. నువ్వు ఎక్కడున్నా త్వరగా రా.. నువ్వు వెళ్లినప్పటి నుంచి నాన్న ఇటు వైపు రాలేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. అంటూ ఇద్దరు చిన్నారులు తమ తల్లి కోసం జూబ్లీహిల్స్ ఠాణా మెట్లు ఎక్కారు. తమ తల్లిని తమకు అప్పగించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివసించే మహిళ (37) జనవరి 17న భర్తతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వారికి పదో తరగతి చదువుతున్న కుమారుడు(15), తొమ్మిది చదువుతున్న కుమార్తె(13) ఉన్నారు. తల్లి ఇల్లు వదిలివెళ్లిన రోజు నుంచి తండ్రి సైతం ఇంటికి రావడం లేదు.
దీంతో చిన్నారులే ఇంట్లో తమ బంధువులతో కలిసి బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే తమ తల్లిని త్వరగా అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె కోసం వెదుకుతున్నారు. మరోవైపు ఆమె భర్తను విచారించేందుకు ఠాణాకు రావాలంటూ ఇప్పటికే పోలీసులు సూచించారు. గతంలోనూ ఆమె భర్తతో గొడవ పడి ఇలానే రెండు, మూడు సార్లు ఇళ్లు విడిచి వెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. ఆమె జాడను త్వరగా గుర్తించాలని, చిన్నారుల ఆవేదనను తీర్చాలని కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్