పర్యాటకానికి ప్రోత్సాహం సేంద్రియానికి సాయం
పార్లమెంట్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సేంద్రియ సాగుకు అగ్రాసనం వేసింది.
కేంద్ర బడ్జెట్‌తో సమకూరే నిధులు
న్యూస్‌టుడే, తాండూరు
పార్లమెంట్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సేంద్రియ సాగుకు అగ్రాసనం వేసింది. టూరిజం అభివృద్ధికి ప్రవేశ పెట్టే ప్రత్యేక పథకాలు జిల్లాలోని అనంతగిరిలో పర్యాటకాభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంది. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పేదలు ఇళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు జరిగింది.
ఇప్పటికే జిల్లాలో రైతుల అనుసరణ
ఇప్పటికే జిల్లాలో కొంత మంది రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇలాంటి రైతులకు మరింత ప్రోత్సాహకరంగా మారుతుంది. జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల మంది రైతులున్నారు. చిరుధాన్యాల పంటలైన కొర్రలు, సజ్జలు. జొన్నలు, రాగులు తదితరాలను సాగుచేసే రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహించనుంది.
* ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాలోని మత్స్యకారులకు అందే నిధులతో చేపల పెంపకం మరింత మెరుగు పడుతుంది.
* బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి అధిక నిధులను కేటాయించింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందుతున్న కూలీలకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది.
మహిళల ఆర్థిక వృద్ధిని పెంచేందుకు..
బడ్జెట్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం మహిళల ఆర్థిక వృద్ధిని పెంచేదిగా ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 16,603 మహిళా సంఘాలు ఉన్నాయి. బ్యాంకుల్లో మహిళలు జమచేసే డబ్బుపై కొత్త పథకంలో భాగంగా వడ్డీ శాతం భారీగా పెరగడం వీరికి కలిసి వచ్చే ఆర్థికాంశం.
తీవ్ర నిరాశ పరిచింది
- డాక్టర్ రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ
కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఎన్నోసార్లు కోరినా కేంద్రం విస్మరించింది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో కేంద్రం నుంచి ఒక్క వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు.
డిజిటల్ గ్రంథాలయాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రంథాలయాలను డిజిటలైజ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 21 గ్రంథాలయాలు ఉన్నాయి. ఒక్కటి కూడా డిజిటలైజ్ కాలేదు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తాండూరు, వికారాబాద్‌లోని గ్రంథాలయాలు డిజిటలైజేషన్ అయ్యేందుకు అవకాశం ఉంది.
వికారాబాద్- కృష్టా లైన్‌పై పెదవి విరుపే
జిల్లాలో పరిగి, కొడంగల్ నియోజక వర్గ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వికారాబాద్- కృష్ణ రైల్వే లైన్ నిర్మాణానికి బడ్జెట్‌లో మోక్షం లభించలేదు. 35 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ట్రాక్ నిర్మాణానికి సంబంధించి యేటా ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిరాశ ఎదురైనట్లే ఈసారి కూడా అదే జరిగింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలి: పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Sports News
GGT vs UPW: ఆష్లీన్, హేమలత హాఫ్ సెంచరీలు.. యూపీ ముందు భారీ లక్ష్యం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
China: పుతిన్‌కు అరెస్టు వారెంట్.. స్పందించిన డ్రాగన్
-
Politics News
Bandi Sanjay: కాలయాపన చేయకుండా రైతులను ఆదుకోండి: సీఎంకు బండి సంజయ్ లేఖ
-
Movies News
Social Look: పైనాపిల్‌కు తమన్నా కళ్లజోడు.. పూజాహెగ్డే డిసెంబరు ఫొటో!