logo

వక్ఫ్‌ ఆస్తులు కాపాడేందుకు చట్టం అవసరం

వక్ఫ్‌ బోర్డు ఆస్తులు కాపాడేందుకు చట్టం తీసుకురావాలని మాజీ ఎంపీ అజీజ్‌పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 02 Feb 2023 03:21 IST

కవాడిగూడ: వక్ఫ్‌ బోర్డు ఆస్తులు కాపాడేందుకు చట్టం తీసుకురావాలని మాజీ ఎంపీ అజీజ్‌పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద ఆల్‌ ఇండియా మైనార్టీ రైట్స్‌ ఫోరం, ఆవాజ్‌, ఇన్సాఫ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శాసనసభలో మూడు సార్లు, బహిరంగ సభలో రెండు సార్లు చేసిన ప్రకటనను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మొత్తం 400 కేసులు ట్రైబ్యునల్‌లో నడుస్తున్నాయన్నారు.ఎంఏ సిద్ధిఖీ, డక్కన్‌ వక్ఫ్‌ ప్రాపర్టీస్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ అధ్యక్షుడు అల్‌ హజీరీ, ఇన్సాఫ్‌ కన్వీనర్‌ మునీర్‌ పటేల్‌, అవాజ్‌ ప్రతినిధి మహ్మద్‌ అలీ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని