విద్యుదాఘాతంతో రైతు మృతి
పొలం దగ్గర పాక మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామంలో బుధవారం జరిగింది.
వికారాబాద్, న్యూస్‌టుడే: పొలం దగ్గర పాక మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ సత్యనారాయణ, కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. పెండ్లిమడుగుకు చెందిన గణపురం అనంత్‌రెడ్డి, అనసూయ దంపతులకు రంగారెడ్డి (35) ఒక్కడే కుమారుడు. ఈయనకు భార్య, మూడేళ్ల కూతురు, ఐదు మాసాల బాబు ఉన్నారు. పొలం దగ్గర పాకలో పనులు చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన చుట్టుపక్కల పొలాల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు గత 29న శివమాల ధరించాడు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణోత్తర పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి
-
India News
Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
India News
Amritpal Singh: భారత్ ‘హద్దులు’ దాటిన అమృత్‌పాల్..!
-
General News
Hyd Airport MetroP: ఎయిర్‌పోర్టు మెట్రో కోసం భూ సామర్థ్య పరీక్షలు