logo

అసెంబ్లీ సమావేశాలకు పటిష్ఠ భద్రత

శాసనసభా బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 3న ప్రారంభం కానున్న సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

Published : 02 Feb 2023 03:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభా బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 3న ప్రారంభం కానున్న సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. సుమారు 1000 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది సమావేశాలు పూర్తయేంత వరకూ బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. వివిధ జిల్లాల నుంచి కానిస్టేబుల్‌ నుంచి ఎస్పీ స్థాయి వరకూ 400 మందికి పైగా సిబ్బందిని రప్పించారు. టీఎస్‌ఎస్పీ, టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, నిఘా పోలీసులు బందోబస్తులో పాలుపంచుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు