logo

దేశంలో సీపీఆర్‌ శిక్షణ పొందిన వారు 2శాతమే

సీపీఆర్‌ శిక్షణ పొందిన వారు విదేశాల్లో 65 శాతం వరకు ఉండగా, మన దేశంలో కేవలం రెండు శాతమే ఉన్నారని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Published : 03 Feb 2023 01:44 IST

ఏఈడీ పరికరాన్ని గవర్నర్‌ తమిళిసైకి అందజేస్తున్న డాక్టర్‌ జి.ఆర్‌. లింగమూర్తి

ఖైరతాబాద్‌:  సీపీఆర్‌ శిక్షణ పొందిన వారు విదేశాల్లో 65 శాతం వరకు ఉండగా, మన దేశంలో కేవలం రెండు శాతమే ఉన్నారని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. గాంధీ వైద్య కళాశాల అలుమ్ని అసోసియేషన్‌, అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా గురువారం సోమాజిగూడలోని సంస్కృతి భవన్‌లో రాజ్‌భవన్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథి గవర్నర్‌ మాట్లాడుతూ.. గుండెపోటుకు గురైన వెంటనే సీపీఆర్‌ చేస్తే ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయన్నారు.  అలుమ్ని అసోసియేషన్‌ అధ్యక్షులు డా.లింగమూర్తి, డా.నర్సింగరావు, డా.చంద్రశేఖర్‌, రాజ్‌భవన్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని