logo

ప్రతిష్ఠాత్మక పథకం.. పకడ్బందీ అమలు

దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని  ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 01:44 IST

శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుంటున్న హోంమంత్రి మహమూద్‌అలీ

నాంపల్లి, న్యూస్‌టుడే: దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని  ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం గురువారం నాంపల్లి గృహకల్ప భవన సముదాయంలో టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రులు మహమూద్‌అలీ, వి.శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ..ప్రతి ఇంటికీ కంటి వెలుగు బృందాలు వెళ్తూ నేత్ర చికిత్స పట్ల ప్రజలను చైతన్య పరుస్తున్నాయని వివరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్‌.ముజీబ్‌ హుస్సేన్‌, టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్‌.ప్రతాప్‌, నేతలు శ్రీనివాస్‌రావు, ఉమాదేవి, శైలజ, ఎస్‌.శ్రీరామ్‌, గడ్డం జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.


సీఎస్‌ అభినందనలు..

ఈనాడు, హైదరాబాద్‌: బీఆర్కే భవన్‌లో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పద్మజ ఆధ్వర్యంలోని వైద్య బృందం సచివాలయ ఉద్యోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని