logo

ఆగిన యంత్రం.. సాగని వైద్యం!

తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌ వైద్యాన్ని మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న నిమ్స్‌లో కోత లేకుండా శస్త్రచికిత్సలు, వ్యాధిని నిర్ధారించడంలో ‘డిజిటల్‌ సబ్‌స్ట్రక్షన్‌ యాంజియోగ్రాఫీ’ (డీఎస్‌ఏ) ల్యాబ్‌ కీలకం.

Published : 03 Feb 2023 01:44 IST

నిమ్స్‌లో రెండేళ్లుగా పనిచేయని డీఎస్‌ఏ ల్యాబ్‌

నిరుపయోగంగా మారిన డీఎస్‌ఏ ల్యాబ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌ వైద్యాన్ని మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న నిమ్స్‌లో కోత లేకుండా శస్త్రచికిత్సలు, వ్యాధిని నిర్ధారించడంలో ‘డిజిటల్‌ సబ్‌స్ట్రక్షన్‌ యాంజియోగ్రాఫీ’ (డీఎస్‌ఏ) ల్యాబ్‌ కీలకం. తల నుంచి కాలి వరకు రక్తనాళాలకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా.. శస్త్రచికిత్స లేకుండా ఈ యంత్రం సాయంతో నయం చేసేందుకు అవకాశం ఉంది. కానీ, అత్యంత కీలకమైన ఈ యంత్రం రెండేళ్లుగా పనిచేయడం లేదు.

కోత లేకుండా నయం చేయొచ్చు

రోగాల్ని గుర్తించి వేగంగా నయం చేయడంలో డీఎస్‌ఏ ల్యాబ్‌ కీలకంగా ఉపయోగపడుతుంది. దీరితో స్కానింగ్‌ చేస్తే అవయవాల్లో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుస్తుంది. ఉదాహరణకు కడుపులో రక్తం లీకయితే కోత లేకుండా ఈ యంత్రంతో నయం చేస్తారు. దీనికి ఇక్కడ సుమారు రూ.లక్ష అయితే ప్రైవేటులో రూ.2 లక్షల ఖర్చు. లివర్‌ క్యాన్సర్‌, బ్రెయిన్‌లో రక్తం బ్లీడింగ్‌ను నిర్మూలిస్తారు. కొన్నిరకాల స్టెంట్‌లు వేసేందుకూ వీలుంది.


కొత్త యంత్రం కొనుగోలకు టెండర్‌

నగరి బీరప్ప, నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌

కొత్త యంత్రం కొనుగోలుకు టెండర్‌ వేశాము. ఓ సంస్థ కూడా ముందుకు వచ్చింది. రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయి కొత్త యంత్రం అందుబాటులోకి వస్తుంది. రోగులు బయటకు వెళ్లకుండా కొన్ని వైద్య పరీక్షలు చేస్తున్నాము. ప్రభుత్వ సహకారంతో ఏ సమస్య లేకుండా వెంటనే పరిష్కరిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని