logo

నాణ్యమైన ప్రసాదానికి భోగ్‌ పత్రం!

దేవాలయాల్లో విక్రయించే ప్రసాదాలు నాసిరకంగా ఉన్నాయని భక్తులు ఫిర్యాదు చేస్తే ఇకపై చర్యలు తప్పవు. ప్రసాదాల నాణ్యతను నాలుగైదు దశల్లో పరీక్షించి ‘భోగ్‌’ (బ్లిస్‌ఫుల్‌ హైజెనిక్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌) పత్రాలను జారీ చేస్తారు.

Published : 03 Feb 2023 01:44 IST

తనిఖీలు, నాణ్యత పరీక్షలయ్యాక జారీ
భక్తుల ఫిర్యాదులపై బల్దియా నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: దేవాలయాల్లో విక్రయించే ప్రసాదాలు నాసిరకంగా ఉన్నాయని భక్తులు ఫిర్యాదు చేస్తే ఇకపై చర్యలు తప్పవు. ప్రసాదాల నాణ్యతను నాలుగైదు దశల్లో పరీక్షించి ‘భోగ్‌’ (బ్లిస్‌ఫుల్‌ హైజెనిక్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌) పత్రాలను జారీ చేస్తారు. తొలిదశలో భక్తులు అధికంగా వచ్చే దేవాలయాలను గుర్తిస్తారు. నీటి, సరకుల నాణ్యత, స్టోరేజీ, వంటగదిలో పరిశుభ్రతపై సూచనలిస్తారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి రిజిస్టర్‌ అయిన సంస్థల ద్వారా ఫాస్ట్రాక్‌ శిక్షణ ఇప్పిస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభమై నెల అవుతోంది.

బల్కంపేట్‌ ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం, మంగళవారాల్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది. 4-5 క్వింటాళ్ల పులిహోర, క్వింటా లడ్డూలు విక్రయిస్తారు. వంటశాలలో 8 మంది పనిచేస్తుండగా ఇద్దరిని శిక్షణకు పంపుతారు.

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయంలో ఆది, మంగళ, శుక్రవారాల్లో రద్దీ ఎక్కువ. 15-70 కేజీల పులిహోర, 500 లడ్డూల విక్రయాలు సాగుతుంటాయి.

కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ దేవాలయంతోపాటు సికింద్రాబాద్‌ ఎస్పీరోడ్డులోని వీర హనుమాన్‌ దేవాలయం, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ దేవాలయం, వివేక్‌నగర్‌ హనుమాన్‌ దేవాలయం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ లక్ష్మీగణపతి దేవాలయం, మినిస్టర్‌రోడ్డులోని సాయిబాబా సమాజం, సికింద్రాబాద్‌లోని గణేశ్‌ దేవాలయాలు భోగ్‌ పత్రాలకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే 10 దేవాలయాలకు భోగ్‌ పత్రాల జారీకి తొలుత ఫుడ్‌ లైసెన్సులను జారీ చేశామని, కొన్ని దేవాలయాల రిపోర్టులు రావాల్సి ఉందని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వాతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని