logo

నంది పురస్కారాలు మళ్లీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం

నంది పురస్కారాలు మళ్లీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని, ఫిలింనగర్‌ మాదిరిగానే టీవీనగర్‌ ఏర్పాటుకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి తెలిపారు.

Published : 03 Feb 2023 01:42 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: నంది పురస్కారాలు మళ్లీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని, ఫిలింనగర్‌ మాదిరిగానే టీవీనగర్‌ ఏర్పాటుకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి తెలిపారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రవీంద్రభారతిలో ‘విశిష్ట టీవీ పురస్కారాల’ ప్రదానోత్సవం కనులపండువగా జరిగింది. సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ అధినేత బండారు సుబ్బారావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. టీవీలో ప్రసారమ్యే ధారావాహికలు సమాజంపై ఎంతో ప్రభావితం చూపుతాయని, అందువల్ల విలువలతో సందేశాత్మకమైనవి నిర్మించాలన్నారు. రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అనీల్‌ కుర్మాచలం, ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్‌చంద్ర, నిర్వాహకులు సుధాకర్‌ పాల్గొన్నారు. ఈటీవీ ‘మనసంతా నువ్వే’ ధారావాహికకు ఉత్తమ కథా సీరియల్‌, ఉత్తమ దర్శకుడిగా మలినేని రాధాకృష్ణ, ఉత్తమ నటుడు హేమంత్‌ (మనసంతా నువ్వే), నటి గౌతమి (రంగులరాట్నం).. నటి నవీన యాట, నటుడు ఉదయ్‌ భాగవతులకు ప్రత్యేక పురస్కారం అందజేశారు. సినీ నటి జయలలితకు ప్రత్యేక పురస్కారం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని