logo

క్రీడోత్సవాల్లో భాగస్వాములు కావాలి: భాజపా

కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘ఖేలో తెలంగాణ-జీతో తెలంగాణ’ పేరిట ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే సికింద్రాబాద్‌ క్రీడోత్సవాల్లో యువత స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని భాజపా.

Published : 03 Feb 2023 01:42 IST

గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎన్‌.గౌతంరావు తదితరులు

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘ఖేలో తెలంగాణ-జీతో తెలంగాణ’ పేరిట ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే సికింద్రాబాద్‌ క్రీడోత్సవాల్లో యువత స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.గౌతంరావు కోరారు. బర్కత్‌పురలోని నగర పార్టీ కార్యాలయంలో క్రీడోత్సవాల గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీనిలోభాగంగా కబడ్డీ, క్రికెట్‌, ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సి.కృష్ణాగౌడ్‌, సందీప్‌ సాయి, నేతలు వనం రమేశ్‌, కిలారి మనోహర్‌, సుమంత్‌, సందీప్‌యాదవ్‌, ఎ.సూర్యప్రకాశ్‌సింగ్‌, చిట్టి శ్రీధర్‌, జ్యోతిరెడ్డి, సత్యనారాయణ, గంగరాజు, శ్యామ్‌రాజ్‌, పవన్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని